Double Ismart: మార్ ముంత చోడ్ చింత ఫుల్ సాంగ్‌ తో వచ్చేసిన రామ్‌ !

-

టాలీవుడ్ యంగ్  హీరో రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్​తో మెప్పించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా మంచి వసూల్లు సాధించి రికార్డులు కొల్ల కొట్టిన విషయం తెలిసిందే. రామ్ కెరీర్​లోనే బ్లాక్ బస్టర్​గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్.  ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా డబుల్ ఇస్మార్ట్​గా వచ్చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ని సైలెంట్ గా పూర్తి చేశారు.

ఈ చిత్రం మార్చి లోనే విడుదల కావాల్సి ఉంది. మరికొంత షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడంతో ఈ చిత్రం విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హనుమాన్ నిర్మాత నీరంజన్ రెడ్డికి విడుదల బాధ్యతలు అప్పగించారు. ఈ తరుణంలో   ఈ చిత్రం  నుంచి ఓ మాస్‌ సాంగ్‌ వచ్చింది. మార్ ముంత చోడ్ చింతా అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ప్రోమోకే ఆడియన్స్ ఫిదా అయ్యారు. పుల్ సాంగ్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం వీక్షించి ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version