భర్తతో విడాకుల తర్వాత సమరసింహారెడ్డి పాటకి స్టెప్పులు.. శాంతి, మదన్ మోహన్ వీడియో వైరల్

-

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత, ఎంపీ విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటూ ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ శాంతిపై భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలన వివాదంగా మారింది. మదన్ మోహన్ ఆరోపణల తర్వాత సదరు మహిళా అధికారి, ఎంపీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వారి వారి అభిప్రాయాలను, వాదనలను వినిపించారు.

మదన్ మోహన్ ఆరోపణలను ఖండిస్తూ.. తాము విడాకులు తీసుకొన్నామని స్పష్టం చేశారు. అయితే విడాకుల తర్వాత తన భర్తతో బాలకృష్ణ సినిమాలోని పాటకు వారిద్దరు చేసిన వైరల్ అయింది. ఇదిలా ఉండగా, తనకు సుభాష్ రెడ్డితో రిలేషన్‌షిప్ ఉందని చెప్పిన శాంతి మాటలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. శాంతి చెప్పిన మాటలను సుభాష్ ఖండించినట్టు ఓ ఆడియో ఫైల్ మీడియాలో లీక్ అయింది. తనకు ఓ కుటుంబం ఉంది. శాంతి నాకు ఎలాంటి సంబంధం లేదు. హాస్పిటల్‌లో సంతకం పెట్టమని ఓ పేపర్ ఇచ్చారు. అయితే అన్నో, తండ్రో, మామ, ఇతర రిలేషన్‌షిప్ అనుకొని సంతకం పెట్టాను. కానీ భర్తగా సంతకం పెట్టించుకొంటారని అనుకోలేదనే చెప్పిన ఆడియో ఫైల్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version