వెంకీ కుడుమల కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత సెట్స్ పైకి ..!

-

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2021 జనవరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డైలమాకి క్లారిటీ వచ్చేసింది.

 

 

ఛలో, భీష్మ సినిమాలతో సక్సస్ లను అందుకున్న వెంకీ కుడుమల రాం చరణ్ కి కథ చెప్పాడు. ఈ కథ చరణ్ కి విపరీతంగా నచ్చడంతో వెంటనే పచ్చ జెండా ఊపేశాడట. చరణ్ కి వెంకీ కుడుమల చెప్పినకథ లో ఫస్టాఫ్ నెరేషన్ సూపర్బ్ అని ఛరణ్ మెచ్చుకున్నాడు. ఇక సెకండాఫ్ లో చిన్న చిన్న మార్పులతో మళ్ళీ చరణ్ ని కలవనున్నాడట వెంకీ కుడుమల. ఈ మార్పులు చరణ్ ఒకే చేస్తే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తాడు. ఈ లోపు రాజమౌళి కంప్లీట్ చేసుకొని వస్తాడు చరణ్. జనవరి వరకు చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి ఫ్రీ అయిపోతాడు.

దాంతో వెంకీ కుడుముల కథ నచ్చగానే నీ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది వెంకీ ఆర్.ఆర్.ఆర్ కంప్లీట్ చేసుకొని వస్తా నెక్స్ట్ మనం సినిమానే చేద్దం అన్నాడట రాం చరణ్. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్దంగా ఉండమని చెప్పాడట. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయో సినిమా ఇదేనని అంటున్నారు. ఈ లోపు ఏదైనా మార్పులు జరిగితే విక్రం కె కుమార్ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కే అవకాశం ఉంది. లేదంటే మాత్రం చరణ్ – వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ముందుగా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి చరణ్ అఫీషియల్ గా అనుకుంటుంది ఈ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే. ఇక ఈ సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version