బాక్సాఫీస్ వద్ద టిల్లూగాడి జోరు.. సిద్ధూకు రామ్ చరణ్ ప్రశంసలు

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన‌ తాజా చిత్రం టిల్లు స్క్వేర్. మార్చి 29వ తేదీన విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మొద‌టిరోజు నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. ఫ‌స్ట్ డే రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్ల రాబ‌ట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమా 9 రోజుల్లో దాదాపు వంద కోట్లు వసూల్ చేసింది.

తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సినిమా సాధించిన భారీ విజ‌యంపై గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పారు.  డియ‌ర్ సిద్ధూ, మీ అద్భుత విజయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ విజయం సాధించిన అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకులు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అలగే టిల్లు టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. అని పోస్టులో చెర్రీ రాసుకొచ్చారు. మ‌ల‌యాళీ భామ అనుపమ పరమేశ్వరన్ క‌థ‌నాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్ తెరకెక్కించారు.  ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version