మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌పై రాయితీలు, హాలిడే కార్డు రద్దు

-

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అలర్ట్. ప్రయాణికులకు మెట్రో అధికారులు షాక్ ఇచ్చారు. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేశారు. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  గతేడాది ఏప్రిల్‌ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దు చేశారు. తాజాగా మరోసారి అదే విధానాన్ని అమలుచేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా మారిన విషయం తెలిసిందే. ఎలాంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో మెట్రో రైళ్లలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. టికెట్ ధర ఎక్కువైనా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకుంటడంతో ప్రజలు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బంది పడకుండా హాయిగా గమ్యాన్ని చేరుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రోను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో అధికారులు మాత్రం ప్రయాణికులు షాకిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version