‘డబుల్ ఇస్మార్ట్’ వరల్డ్​లోకి రామ్ ఎంట్రీ.. న్యూ లుక్ అదిరిందిగా

-

ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ ఊర మాస్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్​తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్​గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చేయబోతున్నారు. ఈ చిత్రం సోమవారం జులై 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జులై 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. రామ్​.. డబుల్​ ఇస్మార్ట్​ వరల్డ్​లోకి పూర్తిగా ట్రాన్స్​ఫర్మేషన్​ అయిపోయాడు.

రామ్​ ఈ సినిమా కోసం.. డబుల్ ఇస్మార్ట్​ వరల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. మాస్​ అవతార్​లో రామ్ న్యూ లుక్ అద్దిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ లుక్ చేంజ్​ చేస్తున్నట్లు చూపించారు. రామ్​.. షార్ట్​ స్పైక్డ్​ హెయిర్​ స్టైల్​లోకి మారిపోయాడు. గడ్డాన్ని కూడా ట్రిమ్​ చేసి.. ఫైనల్​గా ఓ స్టైలిష్ అండ్ మాస్​ అవతార్​గా చేంజ్ అయిపోయాడు. ప్రస్తుతం రామ్ న్యూ లుక్ తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version