జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత బలమైన నేత ఎవరంటే…అసలు చెప్పడానికి మరొక పేరు రాదనే చెప్పాలి. ఏదో కొద్దో గొప్పో నాదెండ్ల మనోహర్ గురించి చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు తప్ప..ఆ పార్టీలో బలమైన నేతలు ఎవరు. ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే సత్తా ఉన్న నాయకులు ఎవరంటే చెప్పడానికి లేదు. అదే వైసీపీ, టీడీపీల్లో చెప్పడానికి నాయకులు ఉంటారు. వారు పార్టీ బలంతో పాటు సొంత బలంతో గెలవగలరు.
కానీ జనసేనలో అలా లేరు. సొంత ఇమేజ్ ఉన్న నేతలు తక్కువ. ఇప్పుడు అదే జనసేనకు పెద్ద మైనస్. ఇటీవల పవన్ కూడా అదే ఒప్పుకున్నారు. టిడిపి, వైసీపీలు మాదిరిగా జనసేనలో బలమైన నాయకులు లేరని అన్నారు. ఇక ఏది వచ్చిన పవన్ మాత్రమే చూసుకోవాలి. ఆయన ఇమేజ్ తోనే పార్టీ ముందుకెళ్లాలి ఎన్నికల బరిలో దిగాలి. ఇంకా మొత్తం భారమంతా పవన్ పైనే ఉంది. అలా ఉండటం వల్ల పార్టీకే మైనస్.
ఇటీవల సర్వేల్లో కూడా అదే తేలిందట. పొత్తులు ఇవన్నీ పక్కన పెట్టి..జనసేన సింగిల్ గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అంటే ఎన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి గెలుపోటములని ప్రభావితం చేస్తుందో చెప్పలేం గాని..సింగిల్ గా వెళితే సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందట. ఇటీవల ఓ సర్వేలో జనసేన సింగిల్ గా 5 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని తేలింది.
గాజువాక, రాజోలు, పిఠాపురం, నరసాపురం,భీమవరం సీట్లలోనే గెలవగలదు అంటా…పైగా ఈ సీట్లలో కాపుల ఓట్ల ప్రభావం ఎక్కువ. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. జనసేన బలం ఏంటి అనేది..కేవలం పవన్ ఇమేజ్, కాపు వర్గం మద్ధతు అంతే..అందుకే జనసేన ఇంకా బలంగా ఎదగడం లేదు. ఎప్పుడైతే బలమైన నాయకులు ఉంటారో అప్పుడే జనసేన రాజకీయంగా బలపడుతుంది.