చిట్టిబాబుకు నాలుగేళ్లు.. బ్లాక్ బాస్టర్ ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నట విశ్వరూపం..

-

‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ .. రెండో సినిమా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో చేశాడు. ‘మగధీర’తో రికార్డులు క్రియేట్ చేసిన చరణ్.. ఆ తర్వాత కెరీర్‌లో సినిమాల పరంగా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూశారు. కానీ, ఎక్కడా తడబడకుండా చిత్రాలు చేసుకుంటూనే ముందుకు సాగారు. ఈ క్రమంలోనే తన నట విశ్వరూపాన్ని ‘రంగస్థలం’ పిక్చర్ లో చూపించి, మెగా అభిమానులు తలెత్తుకునేలా చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్ చరణ్ చేసిన ‘రంగస్థలం’ చిత్రం 2018 మార్చి 30న విడుదలైంది. అనగా నేటికి ఆ మూవీ విడుదలై నాలుగేళ్లు. చ‌ర‌ణ్ కెరీర్‌లో రూ.100కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ ఫిల్మ్ గా అది నిలిచింది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇందులో నటీ నటుల పర్ఫార్మెన్స్ ముఖ్యంగా చెవిటి వాడిగా చెర్రీ నటనను చూసి సినీ ప్రేక్షకులే కాదు ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ సమంత ప్లే చేసింది.

Rangasthalam Movie Stills Starring Ram Charan

2018 సంవత్సరంలో రూ.216 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి ‘రంగస్థలం’ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. తాజాగా రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్స్ విషయానికొస్తే ‘ఆచార్య’ వచ్చే నెల 29న విడుదల కానుండగా, ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో ‘ఆర్ సీ 15’ సినిమా చేస్తున్న చరణ్, ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ‘ఆర్ సీ 16’ ఫిల్మ్ చేస్తున్నారు.

వీటి తర్వాత సుకుమార్ తో మరో సారి సినిమా రిపీట్ చేయనున్నారు. ఇందులో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ హైలైట్ గా ఉండబోతుందని ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చెప్పారు. చూడాలి మరి..సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చే రెండో చిత్రం ఎలా ఉండబోతుందో..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version