టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. రావిషింగ్ బ్యూటీ రాశీ ఖన్నా ఓ సినిమా ప్రీమియర్‌కు కలిసి వెళ్లారు. ఈ ఇద్దరు విజయ్ తమ్ముడు తమ్ముడు ఆనంద్ హీరోగా సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’ సినిమా ప్రీమియర్ చూసేందుకు హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కి వెళ్లారు. వారు థియేటర్‌లోకి ప్రవేశించే సమయంలో అభిమానులు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసి ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక బేబీ సినిమా సంగతికి వస్తే ఈ సినిమాతో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా పరిచయమవుతోంది. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఇవాళ విడుదలకానున్న ఈ సినిమాని ముందుగానే ప్రేక్షకులు వీక్షించేందుకు జులై 13న ప్రీమియర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్, రాశీఖన్నా ఆ సినిమా ప్రీమియర్‌కు హాజరయ్యారు.