ఎడిట్ నోట్: కరెంట్ పోరు..పైచేయి ఎవరిది?

-

మొత్తానికి తెలంగాణలో ఉచిత విద్యుత్ పై జరిగిన రాజకీయం..నిదానంగా ముగుస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం గట్టిగానే జరిగింది.  అయితే ఈ పోరులో ఎవరు పై చేయి సాధించారు..రాజకీయంగా ఎవరు లబ్ది పొందారనేది ఒకసారి చూస్తే..మొదట టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికా పర్యటనకు వెళ్ళిన ఆయన..అక్కడ ఎన్‌ఆర్‌ఐలు అడిగిన ప్రశ్నల్లో భాగంగా కే‌సి‌ఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది..మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొనసాగిస్తారా? అని రేవంత్‌కు ప్రశ్న సంధించారు.

ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ..కే‌సి‌ఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని రైతులని మోసం చేస్తుందని సరిగ్గా 12 గంటలు ఇవ్వడం లేదు..అయితే తెలంగాణలో 3 ఎకరాల లోపు సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారని, 3 ఎకరాలకు నీళ్ళు పెట్టాలంటే 3 గంటలు సరిపోతాయని అన్నారు..అలాగే దాదాపు రోజుకు 8 గంటల కరెంట్ అవసరం అవుతుందని అన్నారు. అంతే తప్ప 24 గంటల కరెంట్ ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు.

కానీ ఆ మాటలనే బి‌ఆర్‌ఎస్ పట్టుకుంది. కే‌టి‌ఆర్ వెంటనే కౌంటర్ ఇస్తూ..అప్పుడు ధరణి తీసేస్తామని అన్నారని, ఇప్పుడు 3 గంటల కరెంట్ అంటున్నారని, కాంగ్రెస్ అంటేనే రైతుల ద్రోహుల పార్టీ అని కే‌టి‌ఆర్ అన్నారు..అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బి‌ఆర్‌ఎస్ శ్రేణులకు నిరసనలు తెలియజేయాలని పిలుపు ఇచ్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు సైతం కౌంటర్లు ఇచ్చారు. రేవంత్ మాటలని వక్రీకరించారని, అసలు ఉచిత విద్యుత్ తెచ్చిందే కాంగ్రెస్ అని, 24 గంటల కరెంట్ ఇస్తామని అన్నారు. రేవంత్ సైతం అమెరికా నుంచి కాస్త క్లారిటీ ఇచ్చారు..ఇప్పుడు రాష్ట్రం వచ్చాక..ప్రెస్ మీట్ పెట్టి మరింత క్లారిటీ ఇచ్చారు.

తన మాటలని వక్రీకరించి..వీడియోలని కట్ చేసి పెట్టారని, అసలు ఉచిత విద్యుత్తుతో కేసీఆర్‌ రూ.8 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అలాగే బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల భూములకే 10-12 గంటలు ఇస్తున్నారని,  రైతుల భూములకు 8 గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పవర్‌ ప్లాంట్ల విషయంలోనూ అవినీతి జరిగిందని, ఇక గత టి‌డి‌పి హయాంలో బషీర్‌ బాగ్‌ కాల్పులకు కారణం కేసీఆరే అని, అప్పుడు కే‌సి‌ఆర్ టి‌డి‌పిలో ఉన్నారని, ఉచిత కరెంట్‌ కుదరదని టీడీపీతో చెప్పించారని,  త్వరలో మోటార్లకు కేసీఆర్‌ మీటర్లు పెడతారని అన్నారు.

అసలు ఉచిత విద్యుత్తు పేటెంటే కాంగ్రెస్‌ది అని,  అధికారంలోకి వచ్చాక 24 గంటలూ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కే‌టి‌ఆర్..రేవంత్‌ని ఛోటా చంద్రబాబు అని విమర్శించడంపై..రేవంత్ స్పందిస్తూ.. తాను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారని, మరి కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా తన గురించి మాట్లాడేదని రేవంత్ ఫైర్ అయ్యారు. అయితే ఇలా ఎవరికి వారు ఉచిత విద్యుత్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక ఎవరిని ప్రజలు ఎక్కువ నమ్ముతారనేది ఎన్నికల సమయంలో తేలుతుంది. మొత్తానికి ఇప్పుడైతే ఈ విషయంలో మొదట బి‌ఆర్‌ఎస్ పై చేయి సాధించిన..వెంటనే కాంగ్రెస్ కవర్ చేసేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version