సనాతన ధర్మం వివాదం.. నెటిజన్ కామెంట్​పై రష్మి ఫైర్

-

తెలుగు టీవీ యాంకర్ రష్మీ గౌతమ్​ ఓ నెటిజన్​పై తీవ్రంగా మండిపడ్డారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత.. గతంలో పలువురు ప్రముఖులు సనాతన ధర్మం గురించి మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అలా విమర్శిస్తున్నారంటే మీ ఎజెండాలు వేరే ఉన్నాయి’ అంటూ టాలీవుడ్‌ హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ట్విటర్​లో వైరల్ కాగా ఆ వీడియోపై రష్మి స్పందించింది. ఆ వీడియో రీ పోస్ట్ చేసి దాని కింద హార్ట్‌ హ్యాండ్స్‌ (బాగుందనే అర్థం వచ్చేలా) ఎమోజీని యాడ్ చేసింది.

దీనిపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ..‘‘డియర్‌ రష్మి.. మీ ధర్మతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఆ పేరుతో బీజేపీ ఎన్నో నేరాలు చేస్తోంది. మతం పేరుతో అమాయకుల ప్రాణాలు బలిగొంటోంది. మణిపుర్‌ ఘటనలను ఓసారి పరిశీలించండి’’ అని అన్నాడు. దీనిపై రష్మి రియాక్ట్ అవుతూ నీకు బీజేపీతో ప్రాబ్లెం ఉంటే నాతో ఎందుకు వాదిస్తున్నావ్.. టైం వేస్ట్ చేసుకుంటున్నావ్ అంటూ నెటిజన్​కు చురకలంటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version