వరంగల్‌ బంద్‌ దృష్ట్యా కేయూ వద్ద పోలీసు బందోబస్తు

-

కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ ప్రవేశాల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పీహెచ్​డీ ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జులుం చేశారని ఆరోపిస్తూ ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేయూ బంద్​తో పాటు వరంగల్ బంద్​కు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

విద్యార్థులపై దాడిని నిరసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఐకాస బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎంజీఎం కూడలి, వరంగల్- హనుమకొండ ప్రధాన కూడళ్ల వద్ద పోలీసుల పహారా చేపట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి సంఘాలు బైకు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో కేయూ దూరవిద్య కేంద్ర వద్ద పోలీసులు భారీగా మోహరించి… విద్యార్థులు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకు ముందు విశ్వవిద్యాలయం వద్ద పలు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు.  బస్సుల నుంచి విద్యార్థులను దించివేసి బంద్‌కు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version