నన్ను ఇంతలా ఎందుకు బాధపెడుతున్నారు.. నాపై అంత ద్వేషం ఎందుకు ? -రష్మిక

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యూట్ హీరోయిన్ రష్మిక మందన..‘‘ఛలో’’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ సుందరి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అమ్మడికి మంచి అవకాశాలు రాగా వాటిని సద్వినియోగం చేసుకుంది. ప్రజెంట్ ఈ భామ పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అయితే ఈ మధ్యకాలంలో విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా సీరియస్ అయింది రష్మిక. తన సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా నన్ను కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వాడిని పరిష్కరించాల్సిన టైం వచ్చిందని అనుకుంటున్నాను. ఆ పని ఎప్పుడో చేయాల్సింది. కానీ లేట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించాలని ఏం లేదు కానీ ఇంతలా విమర్శించడంలో మాత్రం అర్థం లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పవచ్చు కానీ ఇలా ట్రోల్లింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు ఏమనుకున్నా సరే మిమ్మల్ని సంతోష పెట్టడమే నాకు తెలుసు. నేను గర్వపడేలా నటించి, మీ హ్యాపీనెస్ కోసం ఇంకా కష్టపడాలి అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ట్రోల్స్ అడగడం వస్తుంటే అనుకున్నది ఎలా సాధిస్తాను అంటూ రష్మిక ఎమోషనల్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version