ప్రధాని పర్యటనలో ప్రొటోకాల్ ఏదంటూ టీఆర్ఎస్ ఫైర్

-

ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ వస్తోన్న సంగతి తెలిసిందే. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమానికి మోదీ హాజరవనున్నారు. అయితే ఈ కార్యక్రమ ఆహ్వానంలో కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. 11 శాతం వాటాతో కర్మాగారం పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని విమర్శించింది. ప్రధాని తర్వాత అతిథిగా సీఎం కేసీఆర్‌ పేరునే చేర్చలేదని తెలిపింది. నామమాత్రంగా ఆహ్వానం పంపి చేతులు దులిపేసుకుందని మండిపడింది.

‘‘ప్రధాని మోదీ ఈసారి కూడా తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తున్నారు.  మొన్న సర్కారును కూల్చే కుట్ర బయటపడి.. నిన్న మునుగోడులో ఓడి.. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు.. రెండేళ్ల క్రితమే పునఃప్రారంభమై, దేశమంతటికీ ఉత్పత్తులను పంపుతున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే పేర మాయ చేయనున్నారు. తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఆయన ఏం చెబుతారు? విభజనచట్టం హామీల అమలు సంగతేమిటి? నీతిఆయోగ్‌ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడని తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది’’ అని టీఆర్ఎస్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version