అప్పుడు ఇలా జరిగుంటే ఏమయ్యేదో.. మార్ఫింగ్ వీడియోపై రష్మిక స్పందన

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న  మార్ఫింగ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో అర్ధనగ్నంగా ఉన్న ఓ మహిళకు రష్మిక ముఖాన్ని డీపీ ఫేక్ చేసి వైరల్‌ చేశారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహా, పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే తాజాగా దీనిపై రష్మిక స్పందిస్తూ తన హార్ట్ బ్రేక్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని వీడియో.. వైరల్‌ అయినందుకు ఆందోళనకు గురయినట్టు  తెలిపింది.

టెక్నాలజీ ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో వీడియోను చూస్తే తెలుస్తోందని రష్మిక తన ఇన్​స్టాలో పోస్టు పెట్టింది. తాను ఒక నటిగా  ఉన్నప్పుడు ఇది జరిగింది కానీ.. చదుకునే రోజుల్లో ఇలా జరిగి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవో తలుచుకుంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి మరెవరికి జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ… సైబరాబాద్‌ ,మహారాష్ట్ర  సైబర్‌ క్రైం పోలీసులకు ట్యాగ్‌ చేసింది. ఈ మార్ఫింగ్‌ విడియోపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు  స్పందించారు. అమితాబచ్చన్‌ సైతం చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రపతిని కోరుతూ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version