Angelo Mathews : బంగ్లాదేశ్‌ పై రివేంజ్‌ తీర్చుకున్న మథ్యూస్‌

-

Angelo Mathews : వరల్డ్ కప్ 2023 లో భాగంగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్.. సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తప్పించుకున్నాడు. అయితే… అప్పటికే టైం ఔట్ అని అప్పీల్ చేశాడు బంగ్లా కెప్టెన్ షకీబ్.

Angelo Mathews took revenge on Shakib Al Hasan, showed the way to the pavilion by pointing

బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చు అని చెప్పారు ఎంపైర్లు. కానీ బంగ్లా తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో బ్యాటింగ్ చేయకుండానే ఔట్‌గా వెనుదిరిగాడు మాథ్యూస్. దీంతో శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అంతేకాదు… బంగ్లా బ్యాటింగ్ కి రాగానే జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హీట్ పెరిగింది. అతడు 82 రన్స్ వద్ద ఉండగా మాథ్యూస్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. దీంతో షకీబ్ పెవీలియన్ కి వెళుతుండగా మాథ్యూస్ వాచ్ చూపిస్తూ రివెంజ్ తీర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version