ఫ్యాన్స్‌కు ర‌వితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా..?

-

ఇప్ప‌టికే రెండు బ్లాక్ బస్టర్లు అందించిన మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మూడోసారి ‘క్రాక్’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తమ కాంబినేషనులో హ్యాట్రిక్ కొట్టడానికి వారు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఈ రోజు పుట్టిన రోజుజరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా క్రాక్ చిత్రబృందం రవితేజ అభిమానులుకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అదేంటంటే.. ఈ క్రాక్ మూవీని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ, బదాస్ గా కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న క్రాక్. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న శ్రుతి హాసన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏదేమైనా బ‌ర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు ర‌వితేజ‌. కాగా, క్రాక్‌ను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నాడు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖ, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version