కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి అనుచరులు దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.పట్టా భూములు కూడా కబ్జాలు చేసి, భూముల్లోకి వస్తే చంపేస్తామని రైతులను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి అనుచరులకు వనపర్తి ఎస్పీ గిరిధర్, పానగల్ ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆర్డర్‌ను సైతం లెక్క చేయకుండా జూపల్లి అనుచరులు, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవరహిస్తున్నట్లు టాక్.
కొల్లాపూర్ సెగ్మంటులోని పానగల్ మండలం దావూద్ ఖాన్ పల్లి గ్రామంలో 1)వంగ పెద్ద రామన్ గౌడ్, 2)వంగ చిన్న రామన్ గౌడ్, 3)వంగ శేషన్న గౌడ్, 4)వంగ సురేందర్ గౌడ్‌లను నిరుపేదలుగా గుర్తించి 2006లో ప్రభుత్వం సర్వేనెంబర్ 161లో ఒక్కొక్కరికి 1.20 గుంటల చొప్పున నలుగురికి 6 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ భూమిలో 18 ఏళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి అనుచరుడు పానగల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ ముంత భాస్కర్ యాదవ్ ఈ ఆరు ఎకరాల భూమిని వేరే వారితో కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశాడు. ముంత భాస్కర్ యాదవ్‌కు అనుకూలంగా రొడ్డ బాలరాజు నాయుడు, రొడ్డ కుర్మయ్య నాయుడు అనే వ్యక్తులు భూమిలో జేసీబీ పెట్టి పూర్వీకుల సమాధులు,ఈత చెట్లను తొలగించారు. దీనిపై వంగ చిన్న రామన్ గౌడ్ తన సోదరులు కోర్టుకి వెళ్లగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
ఇంజక్షన్ ఆర్డర్‌ను సైతం తుంగలో తొక్కి మంత్రి జూపల్లి అనుచరులు పొలంలోకి అక్రమంగా వెళ్లారు. మంత్రి జూపల్లిని బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకోగా, తన అనుచరులు ఇలాంటి పనులు చేయరని బాధితులను తిట్టి పంపించినట్లు తెలిసింది.
ఈ విషయంలో పానగల్ ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్‌ను, వనపర్తి ఎస్పీ గిరిధర్‌ను బాధితులు కలవగా.. వాళ్ళు మంత్రి జూపల్లి అనుచరులకు మద్దతుగా మాట్లాడి బాధితులను బెదిరించినట్లు తెలిసింది. కోర్టు ఆర్డర్లను జూపల్లి అనుచరులు, పోలీసులు లెక్క చేయడం లేదని, మంత్రి జూపల్లి అనుచరులతో తమకు ప్రాణ భయం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి అనుచరుల దౌర్జన్యాలు
పట్టా భూములను కూడా కబ్జాలు చేసి, రైతులను భూముల్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్న వైనం
మంత్రి జూపల్లి అనుచరులకు అండగా వ్యవహరిస్తున్న వనపర్తి ఎస్పీ గిరిధర్, పానగల్ ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్
కోర్టు ఆర్డర్‌ను సైతం లెక్క చేయని జూపల్లి… pic.twitter.com/Shc2cIbZ8U
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2025