చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జగన్ పై ఇరిగేషన్ మంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక కామెంట్స్ చేసారు. విధ్వంశకారుడే విధ్వంశం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం. దుష్టపాలన, తుగ్లక్ పాలనకు బదులుగా జగన్ పాలన అని ప్రజలు ఉదహారించుకుంటున్నారు. జగన్ 5ఏళ్ళ రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచదేశాలే నివ్వెర పోయాయి. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్దకమైంది, ఢయాప్రం వాల్ కొట్టుకుపోయింది. ఫలితంగా నేడు డివాల్ కు వెయ్యు కోట్లు అదనపు వ్యయం అవుతుంది.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్ల అని చెప్పి అణువణువునా అన్యాయం చేసింది జగనే. ఇలా ఒకటేమిటి జగన్ 5 ఏళ్ళ పాలనలో అన్ని రంగాల ప్రగతి పాతాళం వైపు పరుగులు తీసింది. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్. ఎవరి డబ్బులు, ఎవరికి బటన్ నొక్కావు, అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరధం పట్టలేదు. నీ ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకో. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలనా పరిపక్వత ఉన్న చంద్రబాబు పై విమర్శలు చేస్తే సహించం. చంద్రబాబు,పవన్,మోధీ మేలు కలయికకు విజయం ఆంధ్రుల నిర్ణయం. వీరిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై చేసినట్లే అని మంత్రి నిమ్మల అన్నారు.