Ram Charan : పంచె కట్టుకుని సైకిల్‌పై రామ్ చరణ్..RC15 ఫొటోలు వైరల్..

-

తెల్లటి దుస్తుల్లో పంచెకట్టులో రామ్ చరణ్ సైకిల్‌పై వెళ్లున్నాడు. ఎక్కడో తెలుసా..? ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబో లో తెరకెక్కుతున్న ‘ఆర్ సీ 15’ ఫిల్మ్ షూటింగ్ లో .. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పల్లెటూరి వ్యక్తిలా ఉన్న చరణ్ లుక్ ను చూసి మెగా అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నాలుగు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. షూటింగ్ సందర్భంగా కొందరు అభిమానులు ఈ ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా స్టార్ట్ అయి సామాజిక సందేశాన్నిచ్చే విధంగా ముగుస్తుందని సమాచారం. ఈ మూవీకి స్టోరి కార్తీక్ సుబ్బరాజ్ అందించారు.

‘భారతీయుడు, జెంటిల్ మెన్, అపరిచితుడు’ వంటి చిత్రాల మాదిరిగా ఈ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవబోతుందని టాక్. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతుంది. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ లీడర్ గా , స్టూడెంట్ గా, ప్రభుత్వ ఉద్యోగిగా, సామాన్యుడిగా నాలుగు విభిన్నమైన పాత్రలను రామ్ చరణ్ పోషిస్తున్నట్లు వార్తలొస్తు్న్నాయి. ఈ చిత్ర టైటిల్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది కాగా, ఇందులో శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version