RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.