ఫిల్మ్‌ స్కూల్​కు అకీరా.. హీరో కావడానికి కాదంటూ రేణూ దేశాయ్ ట్వీట్

-

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఖాయమైందని అభిమానుల సంబురపడుతున్నారు. అయితే ఈ విషయంపై అతడి తల్లి రేణూ దేశాయ్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

“నా మనవడు కార్తికేయ, పవన్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’’ అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవల ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను ఆయన కొద్ది సేపటికే తొలగించడం గమనార్హం. కానీ అప్పటికే ఈ ఫొటో వైరలైంది. అభిమానులంతా మరికొద్దిరోజుల్లో అకీరాను బిగ్‌ స్క్రీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ.. ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

దీనిపై రేణూ దేశాయ్‌ తన ఇన్‌స్టాలో స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్‌ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఊహాగానాలు ఆపేయండి. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా పంచుకుంటాను’’ అని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version