మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ రేవతి భర్త భాస్కర్ పేర్కొన్నారు. వాడి కోసమే మేము సినిమాకి వచ్చామని… మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే అని తెలిపారు రేవతి భర్త భాస్కర్. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగిందని వివరించారు రేవతి భర్త భాస్కర్. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారన్నారు. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారని వెల్లడించారు.
కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నారు రేవతి భర్త భాస్కర్. అల్లు అర్జున్ అక్కడికి రాగానే.. జనాలు ఎగబడ్డారన్నారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదని…. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని… రేవతి బంధువులు ఆగ్రహిస్తున్నారు. సంధ్య థియేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవతి బంధువులు.
మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్
వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము
మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే
ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగింది
పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే… https://t.co/rzxg8eLl0y pic.twitter.com/mKs0128pvS
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024