వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ(RGV)..ఎప్పుడూ మీడియా హెడ్ లైన్స్ లో ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ మురళీధర్ రావు పై ఇటీవల ‘కొండా’ పేరిట బయోపిక్ తీసిన వర్మ..తాజాగా మరో సినిమా అనౌన్స్ మెంట్ చేశారు.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ పైన ఫిల్మ్స్ తీయడంలో ఎప్పుడూ ముందుండే వర్మ..ఈ సారి కొవిడ్ మరణాలపైన పిక్చర్ తీస్తున్నారు. ‘కొవిడ్ ఫైల్స్’ అనే పేరుతో కరోనా వలన చనిపోయిన విషయాలపై స్టోరి రాసుకుని ఫిల్మ్ తీస్తున్నారు.
భయానకమైన కొవిడ్ సెకండ్ వేవ్ వెనుక ఉన్నది కరోనా వైరస్ కాదని, అధికార యంత్రాంగ నిర్లక్ష్యమని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్స్ చేశారు. రాజకీయ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని, ఇందులో చూపించే వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పిస్తాయని పేర్కొన్నారు.
COVID FILES film will be a political film because it will blatantly expose the realities which will cause immense anger in the voters who are bound to take it out in the next election pic.twitter.com/7kJryJKf8y
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2022