ఆర్జీవీ ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

-

వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ రామ్ గోపాల్ వర్మ.. సినిమాలో కథ ఉన్నా లేకున్నా టైటిల్ తోనే వివాదాలు చేస్తూ.. వివాదాలు సృష్టిస్తూ సినిమాలు తీస్తుంటాడు. ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ తో సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. హిట్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్లతో ప్రభావితం కాకుండా సినిమాలు తీసుకుంటూ పోవటమే ఆయన పని. అయితే ప్రస్తుతం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ అనే మరో ప్రాజెక్టును ప్రారంభించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌లో పేరుగాంచిన బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇండో చైనీస్‌ కో ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మితమవుతుంది.

ఈ సినిమా టీజర్ ను బ్రూస్ లీ జయంతి రోజైన ఈనెల 27 వ తేదీన(నేడు) సాయంత్రం 3:12 గంటలకు రిలీజ్ అవుతుంద‌ని ఆయన చెప్పారు. అయితే ఆనుకున్న‌ట్టుగానే నేడు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. కాగా, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది. ఇక ట్రైలర్ ను డిసెంబర్ 13 వ తేదీన బ్రూస్ లీ హోమ్ టౌన్ అయిన ఫోషన్ సిటీ లో రిలీజ్ చేయనున్నారు. లీడ్ రోల్ లో  ప్రముఖ హిందీ హీరోయిన్ పూజ భలేకర్ బ్రూస్ లీ పాత్రలో న‌టిస్తుంది. అలాగే ఇండో చైనా టూరిస్ట్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుందట.

Read more RELATED
Recommended to you

Latest news