పెళ్లికి ముందే శృంగారం తప్పు కాదంటున్న ఆర్జీవీ హీరోయిన్..!

-

ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరీర్ ను ఆరంభించి ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన నగ్నం సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ బోల్డ్ బ్యూటీ శ్రీ రాపాక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. చందమామ, నచ్చావులే , దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన శ్రీ రాపాక నగ్నం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె అక్కడ తన డ్రెస్సింగ్ సెన్స్ తో పాటు ఆట తీరుతో కూడా అందరిని అలరించిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. పెళ్ళికి ముందే శృంగారం చేయడం తప్పు ఏమీ కాదు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. అసలు విషయంలోకి వెళ్తే ఒక ఇంటర్వ్యూలో శ్రీరాపాక మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తితో పెళ్లికి ముందే శృంగారం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఒక మగాడు మొగుడు కావాలని కోరుకుంటుంది.. అలాంటప్పుడు శృంగారం చేసి అతడిని వివాహం చేసుకుంటే తప్పులేదు అని ఆమె చెప్పుకువచ్చింది. అంతే కాదు తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక చేదు ఘటనను కూడా గుర్తు చేసుకుంది.

నా ఫ్రెండ్ ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంది. అయితే మొదటి రోజే అతడు ఒక గే అని తెలిసి చాలా బాధపడింది. ఇక జీవితాంతం ఆమె అలా బాధ పడాల్సిందే కదా.. ప్రతి మనిషికి శృంగారం అనేది చాలా ముఖ్యం.. అదే లేనినాడు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు.. అంటూ ఈ ముద్దుగుమ్మ బోల్డ్ గా కామెంట్లు చేసింది. ఇది చూసిన నెటిజెన్లు ఇలా కూడా కామెంట్లు చేస్తారా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version