వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారని విమర్శించారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా మాయమాటలతో ప్రజలను ఆయన మోసగిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ గతాన్ని మరిచిపోయి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
బిజెపి – బీఆర్ఎస్ రెండు తోడుదొంగల పార్టీలని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గృహలక్ష్మి పథకం పేరుతో మరోమారు ప్రజలను మోసం చేసి మూడోసారి గద్దెనెక్కేందుకు కేసిఆర్ సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించుకొని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు పొంగులేటి.