స్టార్స్ రెమ్యునరేషన్‌పై RGV కామెంట్స్..కేజీఎఫ్‌2తో పోల్చుతూ సినిమా మేకింగ్‌పై సూచనలు

-

రామ్ గోపాల్ వర్మ అలియాస్ RGV వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచాడు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్ పైన కొన్ని కామెంట్స్ చేసిన వర్మ..తాజాగా సినీ తారల పారితోషికంపైన కామెంట్స్ చేశారు.

KGF2 సక్సెస్ ను పోల్చుతూ సినీ స్టార్స్ రెమ్యునరేషన్ గురించి ఆర్జీవీ ట్వీట్ చేశారు. కేజీఎఫ్ 2 సినిమాకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుండగా, ఆ సినిమా సక్సెస్ ను గురించి వివరిస్తూ ఆర్జీవీ ట్వీట్ లో పలు విషయాలు ప్రస్తావించారు. స్టార్ల రెమ్యునరేషన్ల కోసం మనీని వృథా చేయకుండా సినిమా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే కనుక మరింత నాణ్యత వస్తుందని, ఈ క్రమంలోనే గొప్ప చిత్రాలు వస్తాయని అనడగానికి KGF 2 మాన్ స్టర్ హిట్ స్పష్టమైన రుజువని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కొద్ది రోజుల కిందట ఏపీ సర్కారు టికెట్ రేట్ల తగ్గింపు విషయం వచ్చిన క్రమంలో ఈ చర్చ వచ్చింది. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే పిక్చర్ బడ్జెట్ లో పూర్తవుతుందని కామెంట్స్ వచ్చాయి. అయితే, స్టార్స్ పడే కష్టానికి రెమ్యునరేషన్ ఇవ్వాలన్న వాదన కూడా వినిపించింది.

అప్పట్లో ఈ టికెట్ రేట్ల తగ్గింపు విషయమై వర్మ అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసి తన అభిప్రాయం చెప్పారు కూడా. అయితే, వర్మ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే చర్చ నెటిజన్లలో జరుగుతోంది. మొత్తానికి వర్మ ఎప్పుడు ఏదో ఒక విషయమై తనదైన శైలిలో విసుర్లు విసురుతానే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version