రిషబ్ శెట్టి కాంతారా2 మూవీ టీమ్ కి షాక్..!

-

రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగ వాళ్లకి ఎందుకు పూనుతాడు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో ఉన్నాయి. ఇక వాటనికి సమాధానం ఈ ఫ్రీక్వెల్లో చూపించబోతున్నాడట రిషబ్ శెట్టి.

తాజాగా ఈ మూవీ షూట్ కి సంబంధించి వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే ప్రస్తుతం ఈ మూవీ
షూట్ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే గ్రామ శివారులోని ఖాళీ మైదానాల్లో మాత్రమే షూట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారట. కానీ చిత్రబృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తుందట.  అంతేకాకుండా పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నారట. దీంతో గ్రామ స్థానికులు షూటింగ్ మూలంగా అటవీ ప్రాంతంలో ఉండే మూగ జీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చిత్ర బృందాన్ని సంప్రదించి మందలించారట. అలా వారి ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, గ్రామానికి చెందిన ఓ యువకుడి పై చిత్రబృందం దాడి చేసిందంట. దీంతో స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై పోలిసులు త్వరగా స్పందించి.. చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో
పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు తెలిపినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version