ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు.
తాజాగా కోర్టు ఏమైనా చెప్పుకునేది ఉందా..? అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే ఇరికించారని కంటతడి పెట్టుకున్నాడు. నేరానికి పాల్పడినట్టుగా ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేశారని తెలిపారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు. తనకు ఉరిశిక్ష కాకుండా.. జైలు శిక్షను విధించాలని ప్రాధేయపడ్డాడు. తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్ కి జీవిత ఖైదీ విధించింది సీబీఐ స్పెషల్ కోర్టు. బీఎన్ఎస్ 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషిగా తేల్చింది సీల్దా కోర్టు.