దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR..ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ పిక్చర్ ను ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను చాలా మంది చూసేస్తున్నారు. కాగా, తాజాగా మేకర్స్ సర్ ప్రైజ్ వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన సన్నివేశాలు కనబడుతున్నాయి. రామ్ చరణ్, తారక్ లు ఇద్దరూ సినిమా షూటింగ్ సందర్భంగా ఎలా ఉన్నారో స్పష్టమవుతోంది.
RRR ZEE 5 Exclusive BTS అనే టైటిల్ తో విడుదలైన ఈ వీడియో యూట్యూబ్ లో బాగా వైరలవుతోంది. ఈ వీడియో ను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. రాజమౌళి అద్భుత ప్రపంచం ఇంత కష్టపడితే ఏర్పడిందా? అని చర్చించుకుంటున్నారు. రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ సూపర్ స్టార్ మహేశ్ తో చేయనున్న సంగతి తెలిసిందే.