దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపైన ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఫిల్మ్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇక థియేటర్స్ లో జనం చిత్రం చూసి ఆనందం వ్యక్తం చేయడమే కాదు.. సంబురాలు చేసుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలోనే కాదు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీలోని ఓ థియేటర్‌లో మహిళా అభిమానులు రచ్చ రచ్చ చేశారు.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల శ్రీలక్ష్మి కాంప్లెక్స్ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రదర్శన తర్వాత ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాట ప్లే అవుతున్న సమయంలో సినిమా చూసిన మహిళలు స్క్రీన్ ముందరకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. అలా గుంపుగా గుమిగూడి కోలాటామాడినట్లుగా డ్యాన్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్న థియేటర్‌లో అలా ఈలలు కొడుతూ, కేరింతలతో చక్కగా టైం స్పెండ్ చేశారు. ఇదంతా కూడా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ ప్రదర్శితమవుతున్న ప్రతీ థియేటర్ లోనూ ఇటువంటి పరిస్థితే ఉంటుందని ఈ సందర్భంగా సినీ అభిమానులు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రజానీకం ఇలా టాకీసులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సెలబ్రేషన్స్ మామూలుగా ఉండటం లేదు. ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజుతో సంబంధం ఉండటంతో పాటు ఇక్కడ మెగా అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉండటం ఓ కారణమని తెలుస్తోంది. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మెగా, నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Srilaxmi Complex,
Nallajarla
West Godavari#RRR mass celebrations by women fans @AlwaysRamCharan @tarak9999 @ssrajamouli @DVVMovies @mmkeeravaani pic.twitter.com/mHUeXlogpD— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 28, 2022