ఎల్లో శారీలో నడుము అందాలతో రెచ్చిపోయిన సదా..!

-

జయం బ్యూటీ సదా చీర కట్టులో మరొకసారి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అందాల విందుతో కుర్ర కారు హృదయాలను కొల్లగొడుతున్న ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది… జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైన సదా అదే తొలి చిత్రం కావడం గమనార్హం. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో వరుసగా ఆమెకు తెలుగులో ఆఫర్లు కూడా లభించాయి.

ఇకపోతే తెలుగులో నటిస్తూనే మరొకవైపు తమిళం, కన్నడలో కూడా అవకాశాలను అందుకుంది. తద్వారా సౌత్ఆడియన్స్ లో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని దక్కించుకోవడం గమనార్హం. ఇకపోతే సదా నటించిన జయం, అపరిచితుడు, నాగ మోహిని, టక్కరి వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె కి ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ రాకతో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. దాంతో ఐదేళ్లపాటు చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉంది..

ఇప్పుడు మళ్లీ వెండితెరపై అలరించడానికి ఎదురుచూపులు చూస్తోంది. అయితే వెంటనే అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాకపోయినా బుల్లితెరపై మాత్రం పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక చివరిగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ఇప్పుడు గ్లామర్ షో చేస్తూ మరింతగా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ చీర ధరించిన సదా తన అందాలతో మరొకసారి ఉక్కిరిబిక్కిరి చేసింది. వయ్యారంగా నడుము, నాభి అందాలతో గిలిగింతలు పెడుతోంది. మొత్తానికి అయితే సదా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version