పాపం.. ఈ హీరోయిన్ ది అదృష్టమా..దురదృష్టమా..?

-

రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించి మంచి నటిగా పేరు పొందింది. ఆ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీతిసింగ్. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. చివరిగా ఈ ముద్దుగుమ్మ కొండ పొలం సినిమాలో నటించింది. ఇది కూడా నిరాశపరిచింది. కేవలం ఇప్పుడు ఈమె ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపైనే పెట్టినట్లుగా తెలుస్తోంది.

అటు బాలీవుడ్ ,టాలీవుడ్ తదితర ఇండస్ట్రీలలో ఈమె నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగు, తమిళ్ వంటి భాషలలో కూడా ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం బాలీవుడ్ లో దాదాపుగా ఐదు సినిమాలు విడుదల అవ్వగా.. అవి కూడా డిజాస్టర్ గానే మిగిలాయి. అయితే ఏ హీరోయిన్ కూడా 2022 లో ఈ రేంజ్ లో సినిమాలను విడుదల చేయలేదని చెప్పవచ్చు. అలా అదృష్టం వచ్చిందో లేదో వెంటనే దురదృష్టం కూడా ఈమెను ఫ్లాపు లా వెంటాడుతూ వచ్చాయి.

అలా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీతిసింగ్ ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సినిమా సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేతులో ఆరు బాలీవుడ్ సినిమాలో అయితే ఉన్నాయి.. రకుల్ ప్రీతిసింగ్ ఉన్న పరిస్థితి అదృష్టం అనాలో లేక దురదృష్టమనాలో అర్థం కావడం లేదంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. రకుల్ అభిమానులు మాత్రం కచ్చితంగా ఈమెకు బ్రేక్ ఇచ్చే సినిమా రానే వస్తుందని తెలియజేస్తున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version