Sai Dharam Tej : మెగా మేన‌ల్లుడి పెళ్ళి సంద‌డి.. ఆ హీరోయిన్‌తో కాదు ఈ హీరోయిన్‌తో న‌ట‌..?

-

సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కి కొదవ ఉండదు. నెటిజన్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా దాని గురించి చర్చించుకుంటారు. ముఖ్యంగా ఎఫైర్లు అంటే చాలు చెవి కోసేసుకుంటారు. గోరంత విషయాన్ని కొండత చేసి బాగా వైరల్ చేస్తారు. ఇలా నిత్యం ఏదోకటి ప్రచారం చేస్తూ ఉంటారు.

Sai Dharam Tej

తాజాగా మెగా కాంపౌండ్ కి చెందిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం యంగ్ హీరోలు, హీరోయిన్స్ ని పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ రెజినాతో లవ్ లో పడ్డాడని ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని పెళ్లి కూడా ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి.

మళ్ళీ ఇంతలో ఇప్పుడు సాయి తేజ్ రెజీనాని కాదని ఇంకో హీరోయిన్ మెహరీన్ ను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరు ఇద్దరు జవాన్ సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారని దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. అయితే అప్పుడు మెహరీన్ ప్రేమను సాయి ధరం తేజ్ ఒప్పుకోలేదట. అందుకే వీరు అప్పుడు డ్రాప్ అయ్యారట. కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలుసుకున్నారని, అందుకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చి అందరిని ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏదీ ఏమైనా సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడానే వార్తలు గత కొన్ని రోజుల నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే గతంలో తిక్క సినిమా హీరోయిన్‌ విషయంలోనూ సాయిధరమ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఏదీ ఏమైనా ఇలా హీరోయిన్స్ తో సాయి ధరమ్ తేజ్ కి లవ్ ఏఫైర్స్ ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో బాగా షికారు చేస్తున్నాయి.

మరి సాయి ధరమ్ తేజ్ ఏ హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడో.. ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడో.. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకుంటాడో లేడో అనే విషయాలపై ఆయనే క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఈ వార్తలు ఆగనే ఆగవు. ఆయన స్పందిస్తే ఈ పెళ్లి వార్తలపై ఓ క్లారిటీ అనేది వస్తుంది. మరి వైరల్ అవుతున్న ఈ వార్తలపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version