SAIF ALI KHAN HEALTH: సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ.. హెల్త్ కండిషన్ సీరియస్!

-

సర్జరీ తర్వాతే సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది.

SAIF ALI KHAN, SAIF ALI KHAN HEALTH

ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. లీలావతి ఆస్పత్రిలో ప్రస్తుతం సైఫ్ చికిత్స పొందుతుండగా.. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది.  మొత్తం సైఫ్ ఆలీఖాన్ కు ఆరు కత్తి పోట్లు జరిగాయట. అందులో రెండు డెప్త్ ఎక్కువ ఉన్నాయని సమాచారం. కాసేపటిలో సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో… ఇద్దరు డాక్టర్లు సర్జరీ చేయనున్నారు. సర్జరీ అయ్యాకా పరిస్థితి వెల్లడించనున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version