బిగ్ బాస్ 12.. సల్మాన్ కు 288 కోట్లు

-

తెలుగు బిగ్ బాస్ వచ్చి కేవలం రెండేళ్లే అవుతుంది కాని హిందిలో మాత్రం బిగ్ బాస్ వచ్చి పదేళ్లు పైనే అవుతుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ హింది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. రియాలిటీ షోస్ లో కొత్త టర్న్ తీసుకునేలా చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి 11వ సీజన్ వరకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నాడు.

సీజన్ సీజన్ కు హింది బిగ్ బాస్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బిగ్ బాస్ అన్ని భాషల్లో వస్తుండటంతో బిగ్ బాస్ హింది మీద అందరు ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలో బిగ్ బాస్ 12 కొద్దిరోజుల్లో మొదలవనుంది. ఈ సీజన్ మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయట. ఒక్కో ఎపిసోడ్ కు సల్మాన్ 12 కోట్ల దాకా ఛాలెంజ్ చేస్తున్నాడట. అంటే కేవలం సల్మాన్ రెమ్యునరేషనే 288 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.

కలర్స్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ 12 వ సీజన్ రెమ్యునరేషన్ డీటైల్స్ ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది. మరి ఇంతలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కచ్చితంగా దానికి తగినట్టుగా లాభాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version