న్యూ ఇయర్ సందర్భంగా ఎమోషనల్ నోట్ వదిలిన సమంత..!

-

మమోసిటీస్ అనే అరుదైన వ్యాధి నుండి కోలుకునేందుకు సమంత మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నానని.. ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తన పరిస్థితి మరింత విషమించిందని.. మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి కఠిన సమయాలనైనా సరే ఎదుర్కొనే ధీరత్వం సమంతాలో ఉంది . అందుకే తాను ప్రకటించిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను ముందుకు నడిపించేందుకు సమంత సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇయర్ ఎండ్ నోట్ అభిమానుల్లో కొంత ఎమోషనల్ రగిలించింది. 2022 సంవత్సరం ముగుస్తున్నందున కొత్త సులభమైన తీర్మానాలు చేయడానికి ఇదే సరైన సమయం అని సమంత చెప్పుకొచ్చింది. సమంత తన నోట్ ద్వారా..” ఫంక్షన్ ఫార్వర్డ్.. మన పరిధిలో వాటిని మనం నియంత్రిద్దాం.. కొత్త ఏడాదికి ముందే సులభమైన రిజల్యూషన్స్ కోసం ఇది సరైన సమయం అని ఊహించండి. మనపై దయ సున్నితత్వం ఉండాలి. గాడ్ బ్లెస్స్ హ్యాపీ 2023!! 2023!! అంటూ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇకపోతే సమంత ఇటీవల నటించినా యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా విడుదల కావాల్సి ఉంది . కానీ కొన్ని కారణాలవల్ల సినిమా విడుదలకు నోచుకోలేదు. సమంత మళ్ళీ వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సెట్స్ లో చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే చూడాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version