టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత ప్రస్తుతం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది. తన భర్త నాగచైతన్య ఒక విడాకులు ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ అదే సమయంలో బిజినెస్ లు కూడా చూసుకుంటుంది సమంత. ఇటీవల నిర్మాతగా అవతారం కూడా ఎత్తింది. శుభం అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ సమంత.
అయితే తాజాగా సమంత రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. హీరోయిన్ సమంత.. రాజ్ నిడిమోర్ ఇద్దరు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే తాజాగా ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. ఒకే కారులో ప్రయాణించడమే కాకుండా రెస్టారెంట్లో డిన్నర్ కూడా చేశారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చి హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్.. హాట్ కామెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు.
ఒకే కారులో సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి వార్తల్లోకి..!
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా సమంత డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హల్చల్
త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు
ఈ క్రమంలో మరోసారి జంటగా కనిపించిన సమంత, రాజ్
వీరిద్దరూ కలిసి ఓ… pic.twitter.com/MOJSM0sqgf
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025