‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్‌

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఇక తాజాగా ఈ సినిమా విడుద‌ల ముందస్తు వేడుక‌ను జ‌న‌వ‌రి 5న నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ వేడుక‌కి హైద‌రాబాద్‌లోని ఎల్‌.బి.స్టేడియం వేదిక కానుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version