తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాల కాలం నుంచి పైరసీ పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రిలీజ్ రోజే పైరసీ రూపంలో నెట్టింట దర్శనం ఇస్తున్నాయి. ఒకప్పుడు కేవలం థియేటర్ ప్రింట్ రూపంలో మాత్రమే పైరసీలు వచ్చేవి. కానీ డిజిటల్ యుగంలో సినిమా స్థాయి మారిపోయింది. పైరసీ ముఠా కూడా టెక్నాలజీకి అనుగుణంగా మొదటిరోజే హై క్వాలిటీతో పైరసీలను చేస్తోంది. ఈ పైరసీల వల్ల నిర్మాతలకు భారీ నష్టం కలుగుతుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలిజ్ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. పైరసీ పై ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే మాట్లాడుతారు. మామూలుగా శుక్రవారం రిలీజ్ రోజు మాట్లాడితే సోమవారం వరకు అది మరిచిపోతారని పేర్కొన్నారు. పైరసీ కి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలన్నారు. FDC చైర్మన్ గా నేను లీడ్ చేస్తాను.. కానీ నిర్మాతలందరూ కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే. పైరసీలపై నిర్మాతలంతా కలిసి వస్తే.. ఏదైనా చేయగలమన్నారు దిల్ రాజు.