Sarkaru vaari paata : “సర్కారు వారి పాట” ట్రైలర్‌ ప్రోమో రిలీజ్‌

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి ట్రైలర్‌ నుంచి ప్రోమో ను చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే.. రేపు సాయంత్రం 4.05 గంటలకు ఈ మూవీ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అప్డేట్‌ తో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version