బండి సంజయ్‌కి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇచ్చిన నిధులపై నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడని.. అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు వేశాడా అందుకే పాదయాత్ర చేస్తున్నావా? అని ప్రశ్నించారు.
నేడు పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచినందుకా నీ పాదయాత్రనా… గ్యాస్ ధర పెంచినందుకా పాద యాత్ర.. ? అని ప్రశ్నించారు. తెలంగాణకు రవాలిసిన్న కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తరలించినందుకా నీ పాద యాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే రా నేను ఈ బహిరంగ సాక్షిగా చెపుతున్న లెక్కలు తీసుకొని రా…నేను చెప్పినవన్నీ అబాధాలని తేలితే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఒక బుడ్ధార్ ఖాన్…వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు సభలు పెడ్తారంట అంటూ మండిపడ్డారు. 70 ఏండ్లు పాలిచాన మీరు రైతులకు ఎం చేసినవ్ అని సభ అని నిలదీశారు ప్రశాంత్ రెడ్డి.