ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను క‌లిసిన టాలీవుడ్‌ విలన్‌ !

-

Sayaji Shinde Meet Pawan Kalyan: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను క‌లిశారు టాలీవుడ్‌ విలన్‌ షాయాజీ షిండే. మంగ‌ళ‌గిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో భేటీ అయ్యారు టాలీవుడ్‌ విలన్‌ షాయాజీ షిండే. ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ప్ర‌సాదంతో పాటు ఒక మొక్క‌ను అంద‌జేస్తే ప‌చ్చ‌దనం పెరుగుతుంద‌ని ఇటీవ‌ల చెప్పిన షాయాజీ షిండే… త‌న ఆలోచ‌న‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పంచుకునేందుకు భేటీ అయ్యారట. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Sayaji Shinde Meet Pawan Kalyan

ఇది ఇలా ఉండగా.. బీజేపీ విజ‌యంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ స్పందించారు. ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వానికి, ప్ర‌జాసంక్షేమ పాల‌నకు ద‌క్కిన ఫ‌లిత‌మే హ‌ర్యానాలో బీజేపీ విజ‌యం అన్నారు. ప్ర‌ధాని మోదీకి, బీజేపీ నాయ‌క‌త్వానికి, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని తెలిపారు.హ‌ర్యానాలో వ‌రుస‌గా మూడోసారి చారిత్రాత్మ‌క విజ‌యం సాధించారని.. జ‌మ్మూకాశ్మీర్‌లోనూ బీజేపీ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుందని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version