‘కబీర్ సింగ్’ ట్రైలర్.. అర్జున్ రెడ్డిని దించేశారు..!

-

అర్జున్ రెడ్డి సినిమా గుర్తుందా మీకు. అస్సలు మరిచిపోతే కదా దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అంటారా? నిజమే.. తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టిన సినిమా అది. విజయ్ దేవరకొండకు సినీ కెరీర్ ఇచ్చిన సినిమా కూడా అదే అని చెప్పుకోవచ్చు.

తెలుగు రికార్డులను బద్దలు కొట్టిన అర్జున్ రెడ్డిని పలు భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. హిందీలో కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందు త్వరలో రాబోతోంది. షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న కబీర్ సింగ్ లో హీరోయిన్ గా కియరా అద్వానీ నటిస్తోంది. అర్జున్ రెడ్డికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాకు కూడా డైరెక్టర్. తాజాగా కబీర్ సింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

కబీర్ సింగ్ ట్రైలర్ చూస్తుంటే.. తెలుగు అర్జున్ రెడ్డిని మక్కీకి మక్కీ దించేశారు అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే.. ట్రైలర్ కే హైలెట్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెల 21 న సినిమా రిలీజ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version