ఇందిరమ్మ ఇళ్లకోసం మరోసారి వెరిఫికేషన్

-

ఇందిరమ్మ ఇళ్ల కోసం మరోసారి వెరిఫికేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకోసం వేల మంది దరఖాస్తులు చేస్తున్నారు. అయితే, తమ పేర్లు జాబితాలో రాలేదని ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో వరుసగా గందరగోళం నెలకొన్నవిషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే అనర్హులను తప్పించి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించేలా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించి.. L1లో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లు, L2లో స్థలం, ఇల్లు రెండూ లేని వాళ్లు, L3లో అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారిని చేర్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version