3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-

3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయింది.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మంది సొంతింటి కల నెరవేరుతోందని చెప్పారు. 3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

President Droupadi Murmu

అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటూ ప్రకటించారు. డ్రోన్‌ దీదీ స్కీమ్‌.. మహిళలకు ఉపయోగపడుతోందని వివరించారు. నేషనల్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించామని ప్రకటించారు. భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మారుస్తామని వెల్లడించారు. ఇండియా AI మిషన్‌ను ప్రారంభించామన్నారు. సైబర్‌ క్రైమ్‌లను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Read more RELATED
Recommended to you

Exit mobile version