‘ఒకే ఒక జీవితం’ కోసం ప్ర‌భాస్‌, రామ్‌ చ‌ర‌ణ్

-

హీరో శర్వానంద్‌.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ గత ఏడాది మొదట్లో శ్రీకారం సినిమాతో ముందుకు వచ్చిన శర్వానంద్‌.. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన… మహా సముద్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. పర్వాలేదనిపించాడు. అలాగే… ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం యావరేజ్ హిట్ అయింది. అయితే.. శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తీక్‌ డైరెక్షన్‌లో ‘ఒకే ఒక జీవితం’ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ మూవీలో హీరోయిన్‌గా పెళ్లి చూపులు ఫేం.. రీతూ వర్మ నటిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌ సినిమా పై అంచనాలను పెంచేశాయి. దాంతో గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్న శర్వా.. ఈ సారి హిట్ కొట్టేలానే ఉన్నాడని అంటున్నారు.

అందుకే గ‌ట్టిగా ప్ర‌మోష‌న్ చేయాల‌ని భావిస్తున్నాడు శర్వా. ఈ క్రమంలో తనతో క్లోజ్‌గా ఉండే ప్రభాస్, రామ్ చరణ్‌ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌కు సోషల్ మీడియా వేదికగా.. ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలిపాడు రామ్ చరణ్. ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ చూసి.. ఎంతో బాగుందని శర్వానంద్‌కి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ సినిమాని ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌ల కోసం స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version