ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా 18 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయింది. 102 పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ పేసర్ షహీన్ అప్రీది వేసిన స్వింగ్ యార్కర్ కు బౌల్డ్ అయ్యారు. షహీన్ అద్భుతమైన బంతి వేశారని.. అది ఆడటం ఎంతటి ఆటగాడికైనా కష్టమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ మాదిరిగా అబ్రార్ వేసిన బంతి స్వింగ్ తిరిగడంతో మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇద్దరూ కీలక ఆటగాళ్లు క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో నిలకడగా ఆడితే టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం 140 పరుగులు చేస్తే.. టీమిండియా విజయం సాధిస్తుంది.