షూటింగ్‌లో అద్భుతం.. పిలవగానే ఎన్టీఆర్ మెడలోకి వచ్చిన పాము.. ఆశ్చర్యపోయిన కేవీరెడ్డి!!

-

తెలుగు వారి ఆరాధ్యుడు సీనియర్ ఎన్టీఆర్.. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ రాణించారు. ఆయన వెండితెరపైన కనబడితే చాలు జనాలు సంబురపడిపోయేవారు. ఇక ఇప్పటికీ ఆయన శ్రీకృష్ణుడు, రాముడిగా తెలుగు లోగిళ్లలో పూజింపబడుతున్నారు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు అయిన ఎన్టీఆర్.. తో టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ‘ఎదురు లేని మనిషి’, ‘యుగ పురుషుడు’ సినిమాలు తీశారు. కాగా, తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో షూటింగ్ టైమ్ లో జరిగిన అద్భుత సంఘటన ఒకటి తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుడు ‘గౌరీ శంకరులు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎన్టీఆర్ శంకరుడి పాత్ర పోషిస్తున్నారు. తన మెడలో రబ్బరు పాము ధరించాల్సి ఉంది. కానీ, ఆయనకు రబ్బర్ ఎలర్జీ ఉండటం వలన కోరలు తీసిన పాము తీసుకురావాలని ఎన్టీఆర్ చెప్పారు. గెటప్ వేసుకుని సెట్ కు వచ్చారు సీనియర్ ఎన్టీఆర్.

సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ కు వచ్చిన క్రమంలో హడావిడి మొదలైంది. సింగీతం శ్రీనివాస రావు మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు. కోరలు తీసిన పామును తీసుకొచ్చి ఎన్టీఆర్ మెడలో వేయాలని అనుకున్నారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్..సింగీతంతో ‘వదలండి బ్రదర్ .. వారే వస్తారు’ అని అన్నారట.

సీనియర్ఎన్టీఆర్

దాంతో కేవీ రెడ్డి ఆయనకు మెదడు అంటే పాముకు మెదడు ఉంటుందా? అని అన్నారట. కానీ, ఆ పాము కొద్ది సేపటికి దానంతట అదే పిలిచినట్లుగా వచ్చి సీనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చి కాళ్ల మీద నుంచి మెడ మీదకు వెళ్లి పడగ విప్పి ఎక్కిందట. అది చూసిన కేవీ రెడ్డి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ‘మిస్టర్ రామారావు యూ ఆర్ సమ్ థింగ్ ఎల్స్’ అని అన్నారట. ఈ విషయం తాజా ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వనీదత్ గుర్తు చేసుకున్నారు. తన బ్యానర్ కు వైజయంతీ మూవీస్ అని పేరు పెట్టిన ఎన్టీఆర్ ను తాను ఎప్పటికీ దేవుడిగానే పూజిస్తానని అశ్వనీ దత్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version